: అటల్జీకి చాట్ చాలా ఇష్టం...నేను ఆయనను స్కూటర్ పై తీసుకెళ్లేవాడిని: అద్వానీ
బీజేపీ కురువృద్ధులు అటల్ బిహారీ వాజ్ పేయీ, లాల్ కృష్ణ అద్వానీ మధ్య ఉన్న అనుబంధం చాలామందికి తెలుసు. దశాబ్దాలుగా పెనవేసుకుపోయిన మిత్ర బంధం వారిది. వాజ్ పేయికి భారత రత్న పురస్కారం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన అద్వానీ ఆయనతో అనుబంధాన్ని, ఆనాటి మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. అటల్జీకి ఛాట్ అంటే చాలా ఇష్టమని, ఢిల్లీ వీధుల్లో యువకులుగా స్కూటర్ పై సవారీ చేసేవాళ్లమని అన్నారు. ఛాట్ తినిపించేందుకు వాజ్ పేయీని స్కూటర్ వెనుక కూర్చోబెట్టుకుని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ కు తీసుకెళ్లేవాడినని అద్వానీ తెలిపారు. బీజేపీ ప్రస్తుత రూపం సంతరించుకోవడం వెనుక వీరిద్దరి కృషి అమోఘమైనది. వాజ్ పేయీ ప్రభుత్వంలో అద్వానీ ఉప ప్రధానిగా పని చేసిన సంగతి తెలిసిందే.