: పొత్తులపై చర్చలకు కాశ్మీర్ కు అరుణ్ జైట్లీ


జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వెలువడడంతో అధికారం చేపట్టేందుకు పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీంతో వణికించే చలిలో కూడా జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. తమతో ఎవరు కలిసి వస్తారో చూసుకుని, లాభనష్టాలు బేరీజు వేసుకుని ముందుకు సాగాలని పీడీపీ చూస్తుండగా, 25 స్ధానాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అధికారం చేపట్టే దిశగా సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ కు సీనియర్ నేత అరుణ్ జైట్లీని రంగంలోకి దించింది. ఇప్పటికే స్వతంత్రులు తమకు మద్దతిస్తున్నారని చెబుతున్న బీజేపీ, ఇప్పటికే మైండ్ గేమ్ ప్రారంభించింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీకి మద్దతిచ్చినా ఆ కూటమి ఎక్కువ కాలం కొనసాగదని బీజేపీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జైట్లీ రాజకీయ చతురతతో జమ్మూ కాశ్మీర్ లో అధికారం చేపడతామని బీజేపీ అధిష్ఠానం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News