: శంషాబాద్, ఢిల్లీ నుంచి వెళ్లే విమానాలు ఆలస్యం
చలిపులి పంజావిసురుతోంది. కురుస్తున్న పొగమంచు ప్రభావం విమాన, రైళ్ల రాకపోకలపై పడింది. హైదరాబాదులోని శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలు ఆలస్యమవుతున్నాయి. శంషాబాద్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్టణం వెళ్లాల్సిన విమానాలు గంట నుంచి 5 గంటల పాటు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని విమానాశ్రయాధికారులు తెలిపారు. కాగా, ఢిల్లీలో కురుస్తున్న పొగ మంచు ధాటికి పలు విమానాలు రద్దవుతున్నట్టు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాధికారులు వెల్లడించారు. కాగా, ఉత్తరభారతంలో కురుస్తున్న మంచు ప్రభావానికి పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.