: ఉబెర్ క్యాబ్స్ పై నిషేధం ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ
ఉబెర్ క్యాబ్స్ పై నిషేధం ఎత్తివేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ క్యాబ్ లపై నిషేధం ఎత్తివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను తిరస్కరించింది. గత నెలలో ఉబెర్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న శివకుమార్ యాదవ్ అనే వ్యక్తి క్యాబ్ లో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఉబెర్ క్యాబ్స్ పై దేశవ్యాప్తంగా నిషేధం అమలవుతోంది. డ్రైవర్ చేసిన తప్పిదానికి సంస్థ ఏం చేస్తుందని పేర్కొంటూ నిషేధం ఎత్తివేయాలని కోరుతూ ఉబెర్ క్యాబ్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిని హైకోర్టు తిరస్కరించింది.