: సంక్రాంతికి ఊరెళ్దామనుకుంటున్నారా? అయితే విమానంలో వెళ్లండి
సంక్రాంతికి ఊరెళ్దామనుకుంటున్నారా? ట్రైన్లు రద్దీగా ఉన్నాయి. బస్సులు సరిపడాలేవు. ఉన్నకాడికి ధరలను విపరీతంగా పెంచేశాయి. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాలకు ఎలా వెళ్లాలా? అనే అనుమానం పీడిస్తోందా? అయితే ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం ఏసీ బస్సు ఛార్జీల ధరకు విమానయానాన్ని అందిస్తోంది. అన్ని పన్నులూ కలుపుకుని కేవలం 1390 రూపాయలకే గమ్యం చేరుస్తామంటోంది. జనవరి 4వ తేదీ వరకు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కాగా, జనవరి 5వ తేదీ నుంచి మార్చి 31 వరకు చేసే ప్రయాణాలకు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వాడియా గ్రూప్ కు చెందిన గో ఎయిర్ సంస్థ కేవలం 1469 రూపాయలకే టికెట్ అందిస్తామని ప్రకటించింది. దీనికి పోటీగా ఎయిర్ ఏషియా ఇండియా తాజా ఆఫర్ ను ప్రకటించింది.