: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పరిశీలకుడిగా భన్వర్ లాల్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) భన్వర్ లాల్ కొత్త సంవత్సరం జనవరిలో జరగనున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికకు అంతర్జాతీయ పరిశీలకుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు జనవరి 2 నుంచి 11 వరకు ఆయన లంకలో పర్యటిస్తారు. దక్షిణాసియా ఎన్నికల నిర్వహణ మండలి కోరిక మేరకు భన్వర్ లాల్ తో పాటు మరో ఇద్దరు సీఈవోలను లంక అధ్యక్ష ఎన్నిక నాలుగో దశ పర్యవేక్షకులుగా బాధ్యతలు నిర్వహించేందుకు పంపాలని తాజాగా భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.