: ఖమ్మం జిల్లా పవర్ ప్లాంటును నల్గొండకు ఎలా తరలిస్తారు?: టీఎస్ ప్రభుత్వంపై పొంగులేటి ఫైర్


నల్గొండ జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం నిన్న టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో 3200 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇప్పటికే స్థల సమీకరణ కూడా పూర్తయిందని... ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్టును నల్గొండ జిల్లాకు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను, విద్యుత్ ప్లాంట్ ను ఏపీకి ఇచ్చేశారని... ఇప్పుడు ఈ ప్లాంటును కూడా వేరే జిల్లాకు తరలించడం దారుణమని అన్నారు. పవర్ ప్లాంట్ తరలి పోకుండా జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News