: సైబరాబాద్ లో కొత్త సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు
సైబరాబాద్ పరిధిలో జరిగే కొత్త ఏడాది వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఒంటిగంట వరకు మాత్రమే వేడుకలు జరుపుకునేందుకు అనుమతి ఉంటుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డీజేలు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. మహిళలకు ప్రత్యేక బ్యారెక్స్ లు ఏర్పాటుచేయాలని మీడియా సమావేశంలో చెప్పారు. ఆయుధాలతో వచ్చిన వారిని పబ్ లలోకి అనుమతించొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఆయుధాలతో వస్తే క్లబ్, పబ్ యజమానులదే బాధ్యత అని అన్నారు. ఇక కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించే ఫాంహౌస్ లు, రిసార్ట్స్, హోటల్స్, పబ్ లు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. వేడుకల రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓబర్లు, ఔటర్ రింగ్ రోడ్డును మూసివేస్తున్నట్టు ఆనంద్ వెల్లడించారు.