: జార్ఖండ్ సీఎం రేసులో తొలి గిరిజనేతరుడు రఘువర్ దాస్


అస్థిర రాజకీయాలకు పుట్టినిల్లయిన జార్ఖండ్ లో తొలిసారి పూర్తి మెజారిటీ సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై ఆ పార్టీ ఓ నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. ఆ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు రఘువర్ దాస్ ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకోనున్నట్టు సమాచారం. ఇంతవరకు జార్ఖండ్ ను గిరిజన నేతలే పాలించారు గనుక తొలిసారి ఓ గిరిజనేతర వ్యక్తికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. మరోవైపు గిరిజనులైన బీజేపీ నేతలు అర్జున్ ముండా, జేపీ టుబిడ్, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కు చెందిన సుదేశ్ మహతో (బీజేపీ సంకీర్ణం)లు ఎన్నికల్లో ఓడిపోవడం కూడా రఘువర్ కు కలిసొచ్చింది. దాంతో బీజేపీ కూడా ఆయననే సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతోంది. ఈరోజు జరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో సీఎం అంశంపై చర్చించి స్పష్టతకు రానున్నారు. తాజా ఎన్నికల్లో జంషెడ్ పూర్ తూర్పు స్థానానికి పోటీచేసిన రఘువర్ 70వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

  • Loading...

More Telugu News