: గంటన్నరలో 10 వేల టిక్కెట్లు హుష్ కాకి!


తిరుమలలో ద్వాదశి పర్వదినం రోజున వెంకన్న దర్శన టికెట్ల కోసం ఇంటర్నెట్లో భక్తులు పోటీ పడ్డారు. ద్వాదశి కోసం జనవరి 2వ తేదీన మొత్తం 10 వేల టికెట్లను నేటి ఉదయం 9గంటలకు టీటీడీ విడుదల చేయగా, గంటన్నర వ్యవధిలో మొత్తం అమ్ముడుపోయాయి. టీటీడీ సర్వర్‌పై ఏక కాలంలో లక్ష మందికిపైగా టికెట్ల కోసం పోటీ పడటంతో సర్వర్ మొరాయించిందని టీటీడీ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ విభాగం తెలిపింది. టికెట్ల కోసం ప్రయత్నించి పొందలేని భక్తులు నిరాశకు లోనవుతున్నారు. టికెట్లు పొందిన భక్తులకు ద్వాదశి రోజున స్వామివారి దర్శనంతో పాటు వైకుంఠద్వార ప్రవేశాన్ని టీటీడీ కల్పించనుంది.

  • Loading...

More Telugu News