: వాజ్ పేయి, మాలవ్యాలకు భారతరత్న: కేంద్రం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యాలకు భారతరత్న పురస్కారాలను ప్రకటించాలన్న కేంద్రం సిఫారసుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి భవన్ ప్రభుత్వ నిర్ణయానికి పచ్చజెండా ఊపింది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో వాజ్ పేయికి భారతరత్న పురస్కారానికి ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లైంది. సుదీర్ఘ కాలం నాటి బీజేపీ కల సాకారం కానుంది. దేశంలో సుపరిపాలన అందించిన ప్రధానిగా వాజ్ పేయి ఖ్యాతిగాంచారు. వాజ్ పేయితో పాటు స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక భూమిక పోషించడమే కాక విద్యావేత్తగా ఎదిగిన మదన్ మోహన్ మాలవ్యాకు కూడా భారతరత్నను అందించాలన్న కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

  • Loading...

More Telugu News