: తెదేపా గూటికి వైకాపా నేత


సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తిరిగి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. నేటి ఉదయం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో భాస్కర రామారావు టీడీపీలో చేరారు. ఎన్నికలకు ముందు ఆయన తన తనయుడితో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన తనయుడు వెంకటరమణ చౌదరి రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి పోటీచేసి ఓడిపోగా, తదనంతర పరిణామాల్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతలతో భాస్కర రామారావు చనువు పెంచుకుంటూ వచ్చారు.

  • Loading...

More Telugu News