: సంజయ్ దత్ కు తాత్కాలిక సెలవులు మంజూరు


పూణెలోని ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు పద్నాలుగు రోజుల తాత్కాలిక సెలవులు మంజూరయ్యాయి. దానికి సంబంధించిన లాంఛనాలు పూర్తయ్యాక ఈ రోజే విడుదలవ్వొచ్చని జైలు సూపరింటెండెంట్ యోగేష్ దేశాయ్ తెలిపారు. అంతకుముందు సెలవుల నిమిత్తం సంజయ్ పెట్టుకున్న దరఖాస్తు తమ వద్దకు వచ్చిందన్నారు. కాగా, ఈ తాత్కాలిక సెలవులను మరో 14 రోజులు పెంచవచ్చని జైలు అధికారులు తెలిపారు. 1993 వరుస పేలుళ్ల కేసులో దత్ కు సుప్రీంకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News