: శిలాఫలకం చోరీతో మంత్రి పర్యటనే రద్దయింది!


తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి బుధవారం నాటి రంగారెడ్డి జిల్లా పర్యటన రద్దైంది. కారణమేంటో తెలుసా? మంత్రిగారు ప్రారంభించాల్సిన పనులకు సంబంధించిన శిలాఫలకం చోరీకి గురి కావడమేనట. వివరాల్లోకి వెళితే, మంత్రి మహేందర్ రెడ్డి తన సొంత జిల్లాలోని పెద్దేముల్ మండలం మంబాపూర్ లో బుధవారం పర్యటించాల్సి ఉంది. గ్రామంలో కొత్తగా ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ రోజు ఉదయం చూసేసరికి అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకం మాయమైంది. దీంతో స్థానిక నేతలు మంత్రికి సమాచారం అందించారు. శిలాఫలకం లేకపోతే, అక్కడికెళ్లి ఏం చేయాలని భావించిన మహేందర్ రెడ్డి ఏకంగా తన పర్యటననే రద్దు చేసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం ఏర్పాటైన స్థలంపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలోనే శిలాఫలకం మాయమైనట్లు స్థానిక నేతలు అనుమానిస్తున్నారు. శిలాఫలకం చోరీకి గురైన ఘటనపై ఫిర్యాదునందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News