: విశాఖలో చిట్టీల పేరిట భారీ మోసం... రూ.80 లక్షలతో ఉడాయించిన నిందితుడు
విశాఖ వాసులకు చిట్టీల పేరిట ఓ వ్యక్తి శఠగోపం పెట్టాడు. చిట్టీలు నిర్వహిస్తున్న అతడు రూ.80 లక్షలతో ఉడాయించాడు. వేలాది మందిని అయోమయంలో పడేసిన అతగాడి ఉదంతం నేటి ఉదయం వెలుగు చూసింది. చిట్టీల ద్వారా పొదుపు పాటిద్దామన్న తమ ఆశలను అడియాశలు చేసిన అతడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నగరంలోని హెచ్ బీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.