: ఉగ్రవాద దాడులను అరికట్టాల్సిందే: రాష్ట్రపతి ప్రణబ్


దేశంలో ఉగ్రవాద దాడులను తక్షణమే అరికట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. అసోం దాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల చర్యపై తీవ్రంగా స్పందించిన ప్రణబ్, ఉగ్రవాదులను అణచివేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. కఠిన చర్యలు తీసుకునైనా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాలని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే బోడోల దాడిలో మరణించిన వారి సంఖ్య 52కు పెరిగింది. దాడి నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News