: సచిన్ ను దాటేసిన కోహ్లీ
టీమిండియా యువకెరటం విరాట్ కోహ్లీ సచిన్ ను దాటేశాడు. సచిన్ రికార్డులు అధిగమించగల సత్తా ఉన్న క్రికెటర్ గా మన్ననలందుకుంటున్న కోహ్లీ దూకుడుగా ఉన్నాడు. సచిన్ రికార్డును కోహ్లీ దాటేశాడు. అయితే అది మైదానంలో కాకుండా సోషల్ మీడియాలో కావడం విశేషం. ట్విట్టర్లో అత్యధిక ఫాలోయర్లు కలిగిన ఆటగాడిగా కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ 48,69, 849 మంది ఫాలోయర్స్ తో ఉండగా, కోహ్లీకి 48,70, 190 మంది ఫాలోయర్లు ఉన్నారు. మిస్టర్ కూల్ టీమిండియా కెప్టెన్ 33,27,033 మంది అభిమానులతో తృతీయస్థానంలో ఉన్నారు. కాగా, మైదానాన్ని వీడినా సోషల్ మీడియాలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దూసుకుపోతున్నాడు. 31 లక్షల మది ఫాలోయర్స్ తో వీరూ నాల్గోస్థానంలో నిలిచాడు.