: నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధం: ఒమర్ అబ్దుల్లా


రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. శ్రీనగర్ లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఎవరూ సంప్రదించలేదని అన్నారు. కాగా, ఈ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఒమర్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కేవలం 15 స్ధానాలు గెలుచుకుని మూడో స్థానానికి పడిపోయింది. కాగా, పీడీపీ 28 స్థానాల్లో విజయం సాధించి అగ్రస్థానం సాధించగా, 25 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ జమ్మూకాశ్మీర్ లో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది.

  • Loading...

More Telugu News