: కాంగ్రెస్ విముక్త భారతదేశాన్ని తయారుచేస్తాం: అమిత్ షా
జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీని ఆదరించిన ఓటర్లకు ధన్యవాదాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ విముక్త భారతదేశాన్ని తయారుచేసేందుకు ఊతమిస్తున్న ప్రజలకు ధన్యవాదాలని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఓటర్లు బీజేపీ, మోదీ నాయకత్వంపై అంతులేని విశ్వాసం ప్రదర్శించారని అన్నారు. జార్ఖండ్ లో కాంగ్రెస్, జేఎంఎం, జేడీ పార్టీల ప్రముఖ నేతలను ఓడించడం ద్వారా ప్రజలు తమకు ఏం కావాలో స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రజాభీష్టాన్ని తాము నెరవేరుస్తామని ఆయన చెప్పారు. ఆరు నెలల్లోగా బీజేపీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని ఆయన వెల్లడించారు. బీజేపీ సదా ప్రజాసేవలో తరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.