: హైదరాబాద్ లో ఇద్దరు సన్ రైజర్సా..!?


ఐపీఎల్-6లో అద్వితీయ ప్రదర్శన చేస్తోన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ కు చెందిన అబేద్ మొయినుద్దీన్ అనే వ్యక్తి సన్ రైజర్స్ యాజమాన్యంపై నేడు సిటీ సివిల్ కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ లో సన్ టీవీతో పాటు బీసీసీఐని కూడా ప్రతివాదిగా చేర్చారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. మొయినుద్దీన్ 'సన్ రైజర్' అనే ఓ ఇంగ్లిష్ పత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఐపీఎల్ టీమ్ అయిన సన్ రైజర్స్ వివరాలను తమను అడుగుతున్నారని, దీంతో తమ విధులకు అంతరాయం కలుగుతోందని మొయినుద్దీన్ పేర్కొన్నారు. తమ పత్రిక పేరు, హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ పేరు ఒకేలా ఉండడంతో గందరగోళం ఏర్పడుతోందని, అందుకే పలువురు తమను ఐపీఎల్ వివరాలు అడుగుతున్నారని ఆయన నేడు మీడియాకు తెలిపారు. ఈ విషయమై గత నెలలో చెన్నైలో ఉన్న సన్ రైజర్స్ కార్యాలయానికి నోటీసు పంపినా స్పందన శూన్యమని, అందుకే తాము కోర్టును ఆశ్రయించామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News