: మధు కోడా ఓడిపోయారు!
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మనీ లాండరింగ్ కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన మధు కోడాకు ఎన్నికల్లో కూడా ఊరట లభించలేదు. మజగావ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన ఓటమిపాలయ్యారు. జేఎంఎం అభ్యర్థి నిరల్ పుర్తి చేతిలో కోడా పరాజయం పాలయ్యారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మధు కోడా, సీఎం హోదాలో ఉండగానే అరెస్టయ్యారు. సుదీర్ఘకాలం పాటు జైలులో ఉన్న మధు కోడా ఇటీవలే విడుదలయ్యారు. సీఎంగా పనిచేసిన తాను గెలవలేనా అంటూ ఎన్నికల్లోకి దిగిన ఆయనకు మజగావ్ ఓటర్లు షాకిచ్చారు.