: సంక్రాంతి కానుకగా పేదలకు రూ.226 విలువైన ఉచిత సరుకులు: చంద్రబాబు
కొత్త ఏడాదిలో సంక్రాంతి పండుగ కానుకగా పేదలకు రూ.226 విలువైన సరుకులు ఉచితంగా ఇవ్వనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో చౌకదుకాణాల ద్వారా ఓ ప్యాక్ లో పేదలకు 20 కిలోల బియ్యం, కిలో గోధుమపిండి, లీటర్ పామాయిల్, అరకిలో బెల్లం, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అందరూ పండుగ జరుపుకోవాలన్నదే తమ లక్ష్యమని, తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రజలందరికీ క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగ శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు.