: జేఎంఎం దూరం కావడమే కొంపముంచింది... జార్ఖండ్ ఫలితాలపై కాంగ్రెస్


జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటువంటి ఫలితం వూహించలేదని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ ఓటమి కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జి బీ.కే.హరి ప్రసాద్ అన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)తో పొత్తు విఫలం చేసుకోకుండా ఉంటే పార్టీకి మంచి జరిగి ఉండేదని ఆయన అన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని హరి ప్రసాద్ పేర్కొన్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News