: జమ్మూ కాశ్మీర్ లో తొలి ఫలితం వెల్లడి... హంగ్ దిశగా కాశ్మీరం
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మూడు గంటల అనంతరం... ఫలితాల వెల్లడి ప్రారంభమయింది. తొలుత, హిరాణానగర్ నియోజకవర్గానికి చెందిన ఫలితం వెలువడింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కుల్ దీప్ రాజ్ విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల సరళిని బట్టి జమ్మూ కాశ్మీర్ లో హంగ్ ఏర్పడటం ఖాయంగా కనబడుతోంది. ప్రస్తుతానికి పీడీపీ 26, బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. కాంగ్రెస్ 16, నేషనల్ కాన్ఫరెన్స్ 14 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నాయి.