: లోక్ సభలో కళ్లు తిరిగి పడిపోయిన ఎంపీ
నిన్న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మత మార్పిడులపై వాడీవేడిగా చర్చ కొనసాగుతున్న సమయంలో సీపీఎం సభ్యుడు సంపత్ ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో, హుటాహుటిన డాక్టర్లను పిలిపించారు. ప్రథమ చికిత్స అనంతరం పార్లమెంటు నుంచి ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో, సభ 4 గంటల వరకు వాయిదా పడింది. ఘటన చోటు చేసుకున్న సమయంలో మత మార్పిడులకు వ్యతిరేకంగా సంపత్ నిరసన తెలుపుతున్నారు.