: నేడు నల్లగొండ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దామరచర్ల మండల పరిధిలోని సర్కారీ భూములపై ఆయన ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. నేటి ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరనున్న కేసీఆర్ నల్లగొండ జిల్లా పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన కేసీఆర్, మున్ముందు కూడా ఈ తరహా సర్వేలు చేపట్టనున్నారు. నేటి పర్యటనలో భాగంగా నేడు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.