: ప్రతిపక్షాలకు కొన్ని కనపడ్డాయి...ఇంకొన్ని కనపడలేదు: ధూళిపాళ్ల
ప్రతిపక్షాలకు కొన్ని కనపడుతున్నాయి...ఇంకొన్ని కనపడడం లేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీఆర్డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది చారిత్రాత్మక బిల్లు అని అన్నారు. రాజధాని కోసం భూ సమీకరణకు చారిత్రక నేపథ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం మనం ఆశల సౌధాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఐటీని బాబు ప్రోత్సహించినప్పుడు కంప్యూటర్లు కూడు పెడతాయా? అని చాలా మంది ప్రశ్నించారని, ఇవాళ రైతు బిడ్డలే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. సీఆర్డీఏ బిల్లులో అభివృద్ధి ప్రణాళికలను సమగ్రంగా వివరించారని ఆయన స్పష్టం చేశారు. సీఆర్డీఏ అంటే ఏపీ రాజధాని కోసం సీఎం ఆధ్వర్యంలో పనిచేసే కమిటీ అని, భూసేకరణ, పట్టణ ప్రణాళిక గురించి బిల్లులో అన్ని వివరాలు పూర్తిగా పేర్కొన్నారని ధూళిపాళ్ల వివరించారు.