: డిప్యూటీ స్పీకర్ వైపు కాగితాలు విసిరేసిన ఆర్జేడీ ఎంపీ


లోక్ సభ నేడు రాష్ట్రీయ జనతా దళ్ సభ్యుడు పప్పూ యాదవ్ అనుచిత ప్రవర్తన కారణంగా వాయిదా పడింది. అంతకుముందు, మతమార్పిళ్ల అంశంపై పలుమార్లు వాయిదా పడిన అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగా, పప్పూ యాదవ్ తన చేతిలోని కాగితాలను డిప్యూటీ స్పీకర్ ఎం.తంబిదురై చైర్ వైపు విసిరేశారు. దీంతో, గందరగోళం ఏర్పడడంతో సభను వాయిదా వేశారు. అనంతరం, పప్పూ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, డిప్యూటీ స్పీకర్ వైపు తాను పేపర్లు విసరలేదని చెప్పారు. తాను దురుసుగా ప్రవర్తించి ఉంటే క్షమాపణలు చెప్పేవాడినని, కానీ, తాను అలా వ్యవహరించలేదని అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, వీహెచ్ పీ, భజరంగ్ దళ్ చేస్తున్న పనులే అందుకు నిదర్శనమని అన్నారు.

  • Loading...

More Telugu News