: 'లేడీ విలన్' అన్న గోరంట్ల... భోరున విలపించిన రోజా
సినిమాల్లో హీరోయిన్ గా నటించి రాజకీయాల్లోకి వచ్చిన రోజా ఇక్కడ కూడా అలానే ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. "దర్శకుడు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్ అనగానే నటించడం మొదలవుతుంది. ఇక్కడ కూడా వాళ్ళ నాయకుడు జగన్ 'యాక్షన్' అనగానే రోజా లేడీ విలన్ లా రెచ్చిపోతున్నారు" అని ఆయన ఎద్దేవా చేశారు. గోరంట్ల వ్యాఖ్యలపట్ల కలత చెందిన రోజా, తన పేరు చెప్పారు కాబట్టి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను పదేపదే కోరారు. స్పీకర్ కోడెల అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె భోరున విలపించారు. ఓ మహిళనైన తనను ఇంతలా దూషిస్తుంటే అధికారపక్షానికి చెందిన ఒక్క సభ్యుడైనా గోరంట్లను అడ్డుకోలేదని ఆమె వాపోయారు.