: రోజాపై అనుచిత వ్యాఖ్యలు... బుచ్చయ్య చౌదరిపైకి దూసుకెళ్లిన చెవిరెడ్డి, రోజా!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ సాయంత్రం నాలుగు గంటల వరకు వాయిదా పడింది. అంతకుముందు, సభలో రైతు రుణమాఫీపై జరిగిన చర్చలో అధికార టీడీపీ, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. ఈ సమయంలో ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన విమర్శలు సభలో తీవ్ర గందరగోళాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ సమయంలో గోరంట్ల వైపు వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా దూసుకువెళ్లారు. దాంతో, వారి ముగ్గురి మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అటు, రోజాపై వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ఈ క్రమంలో సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కోడెల ప్రకటించారు. కాగా, తనపై వ్యాఖ్యల పట్ల రోజా కంటతడి పెట్టినట్టు సమాచారం.