: మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీలో జనతా పరివార్ తొలి నిరసన
పార్టీల సమాహారంగా ఏర్పడిన 'సమాజ్ వాదీ జనతా పరివార్' ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వంపై దేశ రాజధాని ఢిల్లీలో తొలి పోరాటాన్ని ప్రారంభించింది. విదేశాల్లో దాచి ఉంచిన నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ప్రధాని విఫలమయ్యారంటూ జనతా పరివార్ విమర్శించింది. ఈ మేరకు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో, ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రదర్శించారు. నల్లధనాన్ని వెనక్కు తెస్తామని, ప్రతి పేద వ్యక్తికి రూ.20 లక్షలు పంచుతామని అందులో ప్రధాని పేర్కొన్నట్టు ఉంది. అనంతరం నితీశ్ మాట్లాడుతూ, నల్లధనం ఎంత ఉందో తనకు ఐడియా లేదని ఇప్పుడు మోదీ చెబుతున్నారన్నారు. అసలు మోదీకి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని చెప్పారు.