: పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డిపై మరో ఫిర్యాదు
దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్ధన్ రెడ్డి తనయుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డిపై మరో ఫిర్యాదు నమోదైంది. నగరంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా విష్ణు బహిరంగ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు అందింది. ఇటీవల ఓ పెళ్ళిలో కల్వకుర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ యూత్ లీడర్ వంశీచంద్ రెడ్డిపై దాడి చేసిన విష్ణుకు కోర్టు ముందస్తు బెయిలును మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడి తరువాత మీడియాతో మాట్లాడుతూ తాను హైదరాబాద్ లో పుట్టిపెరిగానని, తాను తలచుకుంటే నగరవీధుల్లో తిరగలేరని వంశీచంద్ ను ఉద్దేశించి విష్ణు హెచ్చరించిన సంగతి తెలిసిందే.