: మంత్రి యనమల సోదరుడిపై కేసు నమోదు... విచారణకు ఆదేశించిన ఎస్పీ


ప్రియాంక హేచరీస్ యజమాని గుణ్ణం చంద్రమౌళి ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడిపై విచారణ ప్రారంభమైంది. కృష్ణుడి అనుచరులు 19వ తేదీన ప్రియాంక హేచరీస్పై దాడి చేశారని దాని యజమాని మౌళి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో రూ.25 లక్షల విలువైన ఫర్నీచర్ను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణుడు తనను రూ.10 లక్షలు అడిగారని, ఇవ్వలేదన్న కోపంతో రౌడీలను పంపి హేచరీ ధ్వంసం చేయించారని, చంపుతానని బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని మౌళి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News