: మా అమ్మను పోగొట్టుకున్నా... రోడ్డు ప్రమాదాలను అరికట్టండి: ఎమ్మెల్యే అఖిల ప్రియ
రోడ్డు ప్రమాదాల్లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో చనిపోతుండడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ శాసనసభ జీరో అవర్ లో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రోడ్డు ప్రమాదంలో తాను తల్లిని కోల్పోయానని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి వివరాలను అఖిల ప్రియ సభ ముందుంచారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని ఆమె సర్కారుకు స్పష్టం చేశారు. మొక్కుబడి సమాధానాలతో సరిపెట్టరాదని అన్నారు. కాగా, అఖిల ప్రియ సభలో మాట్లాడడం ఇదే తొలిసారి. ఆమె తల్లి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే.