: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నాం: యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఆ దిశగా పని చేస్తోందని అసంబ్లీలో చర్చ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కూడా తెలియని ప్రతిపక్ష నేత జగన్... అసెంబ్లీ సమావేశాల్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ప్రభుత్వంతో చర్చించకుండానే ప్రతిపక్షం ఆందోళనకు దిగడం సరైంది కాదని సూచించారు.