: ఇప్పటికీ తెలంగాణపై మీడియా దాడి కొనసాగుతోంది: హరీష్ రావు
మీడియాపై తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తెలంగాణపై మీడియా దాడి కొనసాగుతోందని అన్నారు. ఆంధ్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటికి మీడియా ప్రాధాన్యత ఇవ్వడం లేదని... అదే ఆత్మహత్యలు ఇక్కడ జరిగితే మాత్రం ఫుల్ కవరేజ్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి విలేకరులు జోనల్ పేజీల కోసం రాసిన వార్తలను మెయిన్ ఎడిషన్ లో వేస్తున్నారని... ఆంధ్రలో మాత్రం మెయిన్ ఎడిషన్ కోసం రాసిన వార్తలను జోనల్ పేజీలలో వేస్తున్నారని ఆరోపించారు.