: ఏపీ రిపబ్లిక్ డే ఉత్సవాలు విజయవాడలోనే
ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను ఎక్కడ నిర్వహించనున్నారనే విషయంలో సందిగ్ధత వీడింది. ఉత్సవాలను విజయవాడలోనే నిర్వహించనున్నట్టు ఉన్నతస్థాయి పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. స్థానిక బందరు రోడ్డులోని మున్సిపల్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే గుంటూరు, మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ల ఉన్నతాధికారులు ఇందిరాగాంధీ మైదానాన్ని పరిశీలించారు. గత అక్టోబరులో పోలీసు అమరవీరుల దినోత్సవం కూడా ఇదే స్టేడియంలో జరిగింది.