: కేసీఆర్ లాంటి దమ్మున్న సీఎం మరొకరు లేరు: హరీష్ రావు


తన మేనమామ, టీఎస్ సీఎం కేసీఆర్ ను మంత్రి హరీష్ రావు ఆకాశానికెత్తేస్తున్నారు. కేసీఆర్ దమ్మున్న ముఖ్యమంత్రి అని... అలాంటి సీఎం దేశంలో మరొకరు లేరని అన్నారు. ప్రతి ఇంటికి నీరు ఇస్తామని... లేకపోతే తర్వాత జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం ఎంతటి సాహసమో ఊహించుకోవచ్చని అన్నారు. సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో హరీష్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రారంభించినప్పుడు సాధ్యమవుతుందా? అనుకున్నామని, దీక్ష చేసినప్పుడు తామంతా భయపడ్డామని... అయినా, చివరకు పట్టువదలని విక్రమార్కుడిలా తెలంగాణను సాధించారని హరీష్ కొనియాడారు. కేసీఆర్ స్థానంలో మరొకరు ఉంటే అది సాధ్యమయ్యేది కాదని అన్నారు.

  • Loading...

More Telugu News