: నిరంతర పర్యవేక్షణలో సోనియా గాంధీ
శ్వాసకోస సమస్యలతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమెకు శ్వాసకోసకు సంబంధించి పరీక్షలు నిర్వహించామని, ఎలాంటి సమస్యా లేదని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఆమెను నిరంతర వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్టు వారు వెల్లడించారు.