: కర్నూలులో పడగవిప్పిన ఫ్యాక్షన్...తండ్రీకొడుకుల దారుణ హత్య
కర్నూలు జిల్లాలో మరోమారు ఫ్యాక్షన్ పడగ విప్పింది. జిల్లాలోని కౌతాళం మండలం ఉరుకుందలో నేటి ఉదయం పొలానికి వెళ్లిన తండ్రీకొడుకులను ప్రత్యర్ధులు దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పొలం వద్ద మాటువేసిన ప్రత్యర్థులు బాధితులపై వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు. దాడి అనంతరం దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. హతులను రాఘవరెడ్డి, తిమ్మారెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. దాడి నేపథ్యంలో గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.