: అటవీ శాఖ కార్యాలయంలో స్మగ్లర్ల ఆత్మహత్యాయత్నం
ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన స్మగ్లర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మైదుకూరు మండలం వనిపెంటలోని అటవీ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు స్మగ్లర్లు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే వీరిని అటవీ శాఖ సిబ్బంది ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్మగ్లర్ల ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.