: సచిన్ టెండూల్కర్ పై గెలిచిన సౌరవ్ గంగూలీ
సచిన్ టెండూల్కర్ పై సౌరవ్ గంగూలీ విజయం సాధించడమేంటా? అని ఆలోచిస్తున్నారా... ఇద్దరూ క్రికెట్ మైదానం నుంచి రిటైర్మింట్ తీసుకుని ఫుట్ బాల్ జట్ల యజమానులుగా మారిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఛాంపియన్స్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట తొలిసారి భారత్ లో జరిగిన ఫుట్ బాల్ టోర్నీలో పాల్గొన్న జట్లలో సచిన్ కేరళ జట్టును కొనుగోలు చేయగా, గంగూలీ సొంత జట్టు కోల్ కతా ను కొనుగోలు చేశాడు. ఐఎస్ఎల్ ఫైనల్ కు ఈ రెండు జట్లు చేరుకున్నాయి. ఈ రోజు జరిగిన ఫైనల్స్ మ్యాచ్ లో సచిన్ సేన కేరళపై 1-0 తేడాతో గంగూలీ సేన కోల్ కతా విజయం సాధించింది. 90 నిమిషాల ఫుట్ బాల్ ఆటలో రెండు జట్లు హోరాహోరీ పోరాడాయి. మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా మహ్మద్ రఫీక్ గోల్ చేసి కోల్ కతాను విజయపథాన నిలిపాడు.