: మావోలకు ఆయుధాలు సరఫరా చేస్తున్న యువకుడి అరెస్టు
మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలతో పశ్చిమగోదావరి జిల్లాలో నెల్లూరు జిల్లాకు చెందిన శరత్ రెడ్డి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శరత్ రెడ్డి నుంచి తుపాకీ తయారీకి సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, శరత్ రెడ్డి చెన్నైలో ఎంబీఏ పూర్తి చేసినట్టు సమాచారం. ఈ మధ్య కాలంలో ఉభయగోదావరి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు పెద్దగా లేవు. తాజా ఘటన పోలీసుల్లో కలకలం రేపుతోంది. ఏవోబీకి పరిమితమైన మావోలు ఉభయగోదావరి జిల్లాల్లో సంచరిస్తున్నారా? అనే అనుమానం రేగుతోంది.