: అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఇళయరాజా సోదరుడు


ప్రముఖ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ బీజేపీలో చేరారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో అమరన్ ఆ పార్టీలో చేరారు. కాగా, తమిళనాట సినీ నటులకు రాజకీయ చైతన్యం ఎక్కువ. తమిళ సినిమా ప్రముఖుల అంతిమగమ్యం రాజకీయాలు కావడం విశేషం. ఓ స్థాయి పాప్యులారిటీ సంపాదించుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక పార్టీకి మద్దతివ్వడమో, లేక ఏదో ఒక పార్టీలో చేరడమో చేస్తుంటారు. అదే కోవలో అమరన్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News