: సెమీస్ లో సైనా ఓటమి... శ్రీకాంత్ నిలబడతాడా?
దుబాయ్ లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ లో భారత నెంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. ఈ రోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో చైనీస్ తైపీ క్రీడాకారిణి చేతిలో సానియా ఓటమి చవిచూసింది. 21-11, 13-21, 9-21 తేడాతో సైనా నెహ్వాల్ పరాజయం పాలైంది. కాగా, కిదాంబి శ్రీకాంత్ సెమీఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ ఏడాది శ్రీకాంత్ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. సైనా పరాజయంపాలైన నేపథ్యంలో భారత్ బ్యాడ్మింటన్ ఆశలను శ్రీకాంత్ మోస్తున్నాడు.