: టీటీడీకి భూగర్భ శాస్త్ర వేత్తల నివేదిక... భారీ నిర్మాణాలు కూడదని తీర్మానం


తిరుమలలో సహజ ప్రకృతిని ధ్వంసం చేస్తూ నిర్మాణాలను చేపట్టడం వల్ల భవిష్యత్తులో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని భూగర్భ శాస్త్రవేత్తలు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు నివేదిక సమర్పించారు. దీంతో తిరుమలలో భారీ నిర్మాణాలను చేపట్టకూడదని టీటీడీ ఒక తీర్మానాన్ని చేసింది. ఇప్పటికే తిరుమలలో రింగు రోడ్డు పేరిట వందలాది ఎకరాల కొండలను చదును చేసిన సంగతి తెలిసిందే. కొత్త నిర్మాణాల వల్ల బరువు పెరిగి పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగి పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News