: అమరావతికి ప్రాచీన హోదా దక్కింది
ప్రాచీన కాలంలో ప్రముఖ బౌద్ధారామ క్షేత్రంగా వెలసిల్లిన అమరావతిని వారసత్వ నగరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, ఇంతకాలం ఎలాంటి ఆదరణకు నోచుకోని అమరావతికి మహర్దశ పట్టనుంది. వారసత్వ నగరంగా అమరావతిని గుర్తించిన అంశాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎంపీ రాయపాటి సాంబశివరావుకు తెలపగా... ఆయన మీడియాకు వెల్లడించారు. వెంకయ్యనాయుడి చొరవ వల్లే అమరావతికి ప్రాచీన హోదా దక్కిందని... ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రాచీన హోదా దక్కడంతో, ఇకపై అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర నిధులు రానున్నాయి. ఏపీ కొత్త రాజధాని ప్రాంతంలో ఉన్న అమరావతికి ఈ హోదా దక్కడం అందరూ ఆనందించాల్సిన విషయం.