: లంబసింగి మళ్లీ ముసుగేసింది!
ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా విశాఖ జిల్లాలోని లంబసింగి తన పేరు నిలబెట్టుకుంది! తాజాగా, అక్కడ 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులే ఉష్ణోగ్రతలు పడిపోవడానికి కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం లంబసింగి ప్రాంతంలో జనజీవనం దాదాపు స్తంభించిపోయింది. చలి తీవ్రతకు ఇద్దరు వృద్ధులు ప్రాణాలు విడిచినట్టు సమాచారం.