: జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో నేటితో ముగియనున్న పోలింగ్ ప్రక్రియ
జమ్మూ కాశ్మీర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో నేడు తుది దశ పోలింగ్ జరగనుంది. ఈ ఐదో దశలో జమ్మూకాశ్మీర్లోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఝార్ఖండ్ లో 16 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్లో తాజాగా పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొని ఉంది. ఇక, ఝార్ఖండ్ లో నేడు పోలింగ్ జరగనున్న దుమ్కా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు భారీ సభలు నిర్వహించడంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది.