: నీ తాట తీస్తా: వైద్యాధికారికి బీజేపీ నేత బెదిరింపు


ఓ సీనియర్ వైద్య అధికారిని రాజస్తాన్ కు చెందిన ఓ బీజేపీ ఎంఎల్ఏ తీవ్రంగా బెదిరించి భయభ్రాంతులకు గురిచేశాడు. పార్టీ కార్యకర్తకు బంధువైన ఓ నర్స్ ను బదిలీ చేసినందుకు కోట ఎంఎల్ఏ ప్రహ్లాద్ గుంజాల్ "తాట తీస్తా, ఈ రాత్రికి నిద్ర పోలేవు. అంతటి భయాన్ని నీలో పుట్టిస్తా. నిన్ను కొడతా, నేను ఏం చెబుతున్నానో నేకు అర్ధమయిందని అనుకొంటున్నా" అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.ఎన్.యాదవ్ పై కేకలు పెట్టాడు. ఎంఎల్ఏ బెదిరింపు మాటలు ఇప్పుడు వాట్స్ యాప్ తదితర సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో హల్ చల్ చేస్తున్నాయి. బీజేపీ అధిష్ఠానం సైతం గుంజాల్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించడంతో ఆయన లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పారు. అయినా, కోట ప్రాంతంలోని ఇతర వైద్యులు యాదవ్ కు మద్దతుగా నిలిచి నిరసనలు చేపట్టారు. ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News